వనపర్తి కోర్టులో అక్బరుద్దీన్‌పై కేసు

వనపర్తి : ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ సభలో హిందువుల మనోభావాలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్డీన్‌ ఒవైసీపై వనవర్తి కోర్టులో న్యాయవాది మోహన్‌గౌడ్‌ ఐపీసీ సెక్షన్‌ 298కింద దావా వేశారు. ఆ సభలో అక్బరుద్దీన్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, మరోవర్గాన్నా రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించారని ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది మోహన్‌గౌడ్‌ ప్రైవేటు ఫిర్యాదుని కోర్టులో నమోదు చేశారు.