Wednesday, 4 November 2026

వన్నెల్. బి లో సామాజిక తనిఖీ గ్రామ సభ

వన్నెల్. బి లో సామాజిక తనిఖీ గ్రామ సభ

బాల్కొండ జనవరి 10 (జనం సాక్షి ) బాల్కొండ మండలం వన్నెల్ .బి గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం రోజున ఉప సర్పంచ్ నాగులపల్లి కిషన్ డి ఆర్ పి కుమార్ మండల పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో సామాజిక తనిఖీ బృందం గత నాలుగు రోజుల నుండి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరిగిన వివరాలను సేకరించి వాటిని ఇట్టి గ్రామసభలో వెల్లడించారు,
తేదీ 01-11-2019 నుండి 31-03-2022 వరకు కూలీల మొత్తం 71. 24 .559 రూపాయలు మెటీరియల్ 32. 53.085 రూపాయలు మొత్తం 1.03.77. 644 రూపాయలు ఖర్చు అయినదని తెలిపారు, ఉపాధి హామీ కూలీలకు వచ్చే కూలి డబ్బులు బ్యాంకు ద్వారా ఇప్పించాలని మరియు కూలీలు చేసిన పని వివరాలు స్లిప్పులు ఇప్పించాలని కూలీలు కోరడం జరిగింది. మాస్టర్ పై 20 మంది కూలీదారుల సంతకాలు ఒక్కరే సంతకాలు చేసి కూలీ డబ్బులు చెల్లింపులు జరిగినవి, కళ్ళలా ప్రొసీడింగులు
ఒక్కరి పెరు, కళ్లలు నిర్మాణం చేసిన వారు ఇంకొకరు తనికి బృందం వెల్లడించగా వీటి వివరణలో మండల అధికారులు ఎంపీడీవో సంతోష్ కుమారు చెప్పినారని ఇట్టి సభలో తెలిపారు,అలాగే 35 కల్లాల నిర్మాణం చేసిన వారికి చెక్ మేజర్మెంట్ లేకుండానే మండల అధికారులు డబ్బులు చెల్లింపులు అలాగే 14 వర్క్స్ పైన కూడా చెక్ మెజర్మెంట్ లేకుండానే డబ్బులు చెల్లింపులు చేసిన మండల అధికారులు, ఇట్టి కళ్ళలా లో నిర్మాణం అయిన తర్వాత నిర్మాణం వద్ద ఇట్టి పని వివరాలు తెలిపే సూచిక బోడు నిర్మాణము కొరకు నిర్మాణాలు లేకుండానే నిర్మాణం కయ్యే
రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది ఇట్టి వివరాలు తెలిపే సూచిక బోడ్లు గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్నట్లు తనిఖీ చేసిన బృందం తెలిపారు, గ్రామంలో ఉపాధి హామీ పనులు చేసే వన సేవకులకు గత నాలుగు మాసాల నుండి డబ్బులు రావడం లేదని అధికారులకు తెలిపారు గ్రామంలో ఉపాధి హామీ పనులు కూలి పని చేయని వారికి డబ్బులు రావడం పనిచేసిన వారికి డబ్బులు రాకపోవడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తనిఖీ బృందం సభ్యులు సాయికుమార్, సింధుజ, నిహారిక, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, టి.ఏ. రవీందర్, క్షేత్ర సహాయకులు, వార్డు సభ్యులు ఆశా కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు అంగన్వాడీ టీచర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది
గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.