కోదాడ జూన్ 2(జనం సాక్షి)
నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపు ధోరణితో చేసిన అభివృద్ధి ఫలాలతోనే నేడు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందే తప్ప వారు కొత్తగా చేసిందేమీ లేదని తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంబూరి సూర్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణ తెలుగుదేశం కార్యాలయంలోజండా ఆవిష్కరించి మాట్లాడారు. ఎందరో అమరవీరులత్యాగపలంగ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ఏ ఒక వ్యక్తి వల్లవచ్చింది కాదు అని తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరన్నా బంగారు తెలంగాణ కాకుండా బాధల తెలంగాణా గామారింది అన్నారు. ఈ
కార్యక్రమంలోపట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఉప్పుగండ్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి.పిడతల శ్రీనివాసరావు, ముత్తినేని సైదేశ్వరావు మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




