బిచ్కుంద మే23 (జనంసాక్షి) అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లులను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు విడుదల కావడంతో ఇప్పటి వరకు సొంత డబ్బులతో అభివృద్ధి చేయించిన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులకు ఉపశమనం కలగనుంది. దీంతో పాటు గ్రామాల్లో మరింత అభివృద్ధి చేయొచ్చని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. కాగా దీనిపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హమ్మయ్య… ఎట్టకేలకు విడుదలైన జీపీ నిధులు




