Tuesday, 3 November 2026

శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక సమేత మల్లిఖర్జున స్వామి రుద్రాభిషేకం మహాచండి యాగం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహింరమావత్ రవీంద్ర కుమార్చిన

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఎప్రిల్ 5 జనంసాక్షి న్యూస్ :శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక సమేత మల్లిఖర్జున స్వామి అనుగ్రహం పొందాలి అని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు బుధవారం చిన్నఆడిశర్లపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లిఖర్జున స్వామి రుద్రాభిషేకం మహాచండి యాగం కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు దేవాలయాల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరు యుగేందర్ రెడ్డి,రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, నేనావత్ రాంబాబు నాయక్,సర్పంచ్ శ్రీరాములు, రావుల వెంకటయ్య యాదవ్, రావుల సత్యనారాయణ యాదవ్, కృష్ణయ్య, రమావత్ తులిసిరామ్ బొడ్డుపల్లి కృష్ణ,శివ, తదితరులు పాల్గొన్నారు