వరద బీభత్సంపై సిఎం కెసిఆర్‌ ఏరియల్‌ సర్వే

నేడు గోదావరి తీర ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ద్వారా పరిశీలన
ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
గోదావరివరద ప్రాంతాల్లో అత్యవసర సేవలకు ఆదేశాలు

హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గోదావరి పరివాహక
ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగిపోయింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో ఏరియల్‌ సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్వహించారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారని వెల్లడిరచింది. కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే కొనసాగుతుందని తెలిపింది. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారని వెల్లడిరచింది. దీనికి సంబంధించి హెలికాప్టర్‌ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్‌ ను ఫైనల్‌ చేయనుంది. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని వైద్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. సహాయక చర్యల్లో స్పీడ్‌ పెంచాలని సూచించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు సవిూక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం ఏరియల్‌ సర్వే చేపట్టనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే.. భద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే శుక్రవారంతో పోలిస్తే.. గోదావరి వరద కాస్త తగ్గుతోంది. గంటగంటకూ వరద ఉధృతి తగ్గుతుండటంతో.. ప్రస్తుతం 71.90 అడుగులకు చేరింది. వరద బాధితుల కోసం జిల్లాకు 10 ఎన్డీఆర్‌ఎఫ్‌, 5 ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్స్‌ ను తరలించారు. 95 ముంపు బాధిత గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 77 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 20 వేల 922 మందిని.. సెంటర్లకు తరలించారు. భద్రాచలం టౌన్‌ తో పాటు చుట్ట పక్కల ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం దగ్గర 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గోదావరి నీటిమట్టం పెరిగిందని స్థానికులు తెలిపారు. వరద కొనసాగడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు(ఊజీసతిబఠ సజీనీ) సవిూక్షాసమావేశాన్ని నిర్వహించనున్నారు.
ములుగు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం శాంతించింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్‌ దగ్గర 18.610 విూటర్ల నుంచి 17.500 విూటర్లకు వరద ప్రవాహం తగ్గింది. కాగా… మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధలోనే ఉన్నాయి. మరోవైపు ఈరోజు ఏటూరునాగారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పర్యటించనున్నారు. అటు భూపాలపల్లి జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటిస్తున్నారు.