వరికి కాదు ఉరి.. బీజేపీకి గోరీ కడతాం
ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్,డిసెంబర్20(జనం సాక్షి ): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యం కొనకపోతే వరికి కాదు ఉరి.. బీజేపీకి ఘోరీ కడతామన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే దివాకర్ రావు, భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.