Monday, 2 November 2026

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం :వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, సర్పంచ్ చిత్తరి గౌడ్.

దౌల్తాబాద్ నవంబర్ 8, జనం సాక్షి.
రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, సర్పంచ్ చిత్తరి గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఉప్పారపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజనూ కొంటున్నామన్నారు. గతంలో కరువుతో అల్లాడిన పాలమూరు రైతులు ఇప్పుడు ఏడాదికి మూడు పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రతి గింజనూ కొనేందుకే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. రైతులు నిర్ణీత ప్రమాణాల మేరకు ధాన్యం తీసు కొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. రైస్ మిల్లర్లు, సెంటర్ల నిర్వాహకులు తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేణుక,ఏఎంసి డైరెక్టర్ నాగరాజ్ గౌడ్, సి సి బాలరాజు,వార్డు మెంబర్లు బాలయ్య చారి, లక్ష్మణ్ చారి,కో ఆప్షన్ సభ్యులు, హమాలి సంఘం నాయకులు, రైతులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు