Monday, 2 November 2026

తెలుగుదేశం నూతన అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపిన

తెలుగునాడు కల్లు గీత కార్మిక సంఘం ప్రతినిధులు
ఎల్బీ నగర్ (జనం సాక్షి  )తెలుగునాడు కల్లు గీత కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు కొయ్యడ స్వామి గౌడ్ ఆధ్వర్యంలో  100కార్యవర్గ సభ్యులు తెలంగాణ తెలుగుదేశం నూతన అధ్యక్షులు  కాసాని జ్ఞానేశ్వర్ ని ఆయన నివాసానికి   వెళ్లి   కలిసి శుభాకాంక్షలు తెలిపారు   .వారితో రెండు రాష్ర్టాల గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల   పైన  చర్చించడం జరిగింది  .కాసాని జ్ఞానేశ్వర్  అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సమస్యలపై తగు కార్యక్రమాలు రూపొందించి  టిడిపి పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేసే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు  . కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గజేంద్ర గౌడ్  ,జాతీయ కార్యవర్గ నిర్వాహక కార్యదర్శి   యాండ్రా  లోకేశ్వర్ గౌడ్  వెంకటేష్ గౌడ్ తదితరులు  లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు