Wednesday, 4 November 2026

వరి ధాన్యాన్ని మార్కెట్ కమిటీ గోదాంలో దిగుమతి చేయించిన సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

జనంసాక్షి, మంథని : మంథని మండలం సూరయ్యపల్లి శ్రీ లక్ష్మి రైస్ మిల్లు లో స్థలం కొరత ఉండటంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం మాట్లాడి డిసిఎస్ఓ తో మిల్లు కేటాయింపు ఇప్పించి వరి ధాన్యాన్ని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కటి అనంత రెడ్డి లు శనివారం దిగుమతి చేయించారు. రైస్ మిల్లు లో స్థలం కొరత కారణంగా మిల్లు యజమాని దిగుమతి చేసుకోక పోవటం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలింపుకు ఇసుక లారీలను సమీకరించి దాన్యాన్ని మిల్లులకు పంపుతున్నందున రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రావటంతో ఇసుక లారీ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో, రైతుల శ్రేయస్సు దృశ్య పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మంథని వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించి లారీల్లోని వరి ధాన్యాన్ని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ దగ్గర ఉండి మరి ధాన్యాన్ని హమాలీలచే దిగుమతి చేయించారు. వర్షాలు ముంచుకొస్తున్న తరుణంలో తాము కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు.