వరి, పత్తి పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో గురువారం పర్యటించారు. ఇందులో భాగంగా సాగువతున్న కమాన్ పూర్ క్లస్టర్ పరిధి లోని పంటల నమోదు కార్యక్రమాన్ని తన చరవాణి ద్వారా నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. వరి పైరు లో ఆకు మచ్చ నివారణకు సూడోమోనస్ 5గ్రాములు ఒక లీటర్ నీటికి చోప్పున కలుపుకొని పిచికారి చేయాలి,విధిగా వేప నూనె పిచికారి చేయడం ద్వారా పైరుల పై వచ్చే పురుగులను అదుపులో ఉంచవచ్చు అని ,రైతులు ఎక్కువగా పశువుల ఎరువును వినియోగించుకోవాలని సూచించారు మరియు పోటాష్ ఎరువును వాడటం ద్వారా పంట వ్యాధి నిరోధక శక్తి ని పెంచాలని తెలిపారు. పత్తిలో ఎండు తెగులు గమనించడం జరిగిందని నివారణకు ఒక లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 5 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని కలుపుకొని ఆ ద్రావణాన్ని మొక్కల మొదళ్లు తడిచేటట్లు పోయాలి ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు అజ్మీర సురేష్, యాదగిరి శ్రీనివాస్,వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్, పలువురు రైతులు పాల్గొన్నారు.