Tuesday, 3 November 2026

వరుసగా రెండోసారి కెసిఆర్‌ బడ్జెట్‌

తొలిరోజే బడ్జెట్‌ ప్రతిపాదనలు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  తెలంగాణ అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలు సోమవారమే ప్రారంభ మయ్యాయి. సోమవారం ఉదయం11.30 గంటలకు అసెంబ్లీ  స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మొదలయ్యాయి. తొలిరోజే బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ద్వారా సిఎం కెసిఆర్‌ కొత్త సంప్రదాయాన్ని  ప్రారంభించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ వరుసగా రెండోసారి  బ్జడెట్‌ ప్రవేశపెట్టారు. మండలిలో బ్జడెట్‌ను ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. మార్చి నెలలో ఆరు నెలల కాలానికి ఆమోదం పొందిన ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన ఈ బ్జడెట్‌కు ఉభయసభలు ఆమోదం తెలుపనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంవత్సరం మధ్యలోనే నిధులకు తీవ్ర కటకట నెలకొంది. అన్ని శాఖల్లో రూ.27,535 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క సాగునీటి శాఖకే రూ.10 వేల కోట్ల బకాయి లున్నాయి. రోజుకు రూ.50 కోట్లకు మించి చెల్లింపులు లేవని అధికారులు చెబుతున్నారు. ఐజీఎస్టీ నిధులు వస్తేనే బిల్లుల క్లియరెన్స్‌ అవుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్త హావిూలకు నిధుల మంజూరు సవాలుగా మారింది. మార్చిలో మొత్తం రూ. 1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ సమర్పణ అనంతరం తెలంగాణ శాసనసభ ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది.  ఉదయం 11:30 గంటలకు బ్జడెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభను ప్రారంభించిన అనంతరం ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బ్జడెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. సుమారు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ బ్జడెట్‌ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బ్జడెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే సభను 14వ తేదీ శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రెకటించారు.
అసెంబ్లీలో ముందు వరసలో ఎంఐఎం
శాసనసభలో పార్టీల స్థానాలు మారిపోయాయి. సభలో… కాంగ్రెస్‌  పార్టీ ప్రతిపక్ష స్థానం కోల్పోయింది. ఈ క్రమంలో… ఎంఐఎం సభ్యులకు ముందు వరుసలోని సీట్లను కేటాయించారు. కాంగ్రెస్‌ లెజిస్లేచరీ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్కకు రెండవ వరుసలో సీటును కేటాయించారు. కాంగ్రెస్‌ నుంచి అనేకులు ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయింది. దీంతో సీట్ల పరిస్థితి మారింది.