హైదరాబాద్,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : శాసనసభ బ్జడెట్ సమావేశాల తేదీలను బీసీఏ ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు బ్జడెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 15, 16వ తేదీల్లో బ్జడెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. బ్జడెట్‌పై ప్రశ్నలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. ఈ నెల 17వ తేదీన పద్దులపై అసెంబ్లీలో చర్చ ఉంటుంది. ఈ నెల 22న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించనున్నారు. ఆదివారాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.
22 వరకు బడ్జెట్ సమావేశాలు




