గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాల వలన పంట నష్ట జరిగిన దండేపల్లి మండలం మాకులపెట్ గ్రామంలో బుధవారం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సందర్శించారు.వర్షాల వల్ల నష్ట జరిగిన పంటలను మరియు తాళ్ళపెట్ గ్రామంలో నష్ట జరిగిన మక్క పంటను పరిశీలించి జరిగిన పంట నష్టం పై రైతలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అకాల వర్షాల వలన నష్ట పోయిన పంటలకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రఘునాథ్ డిమాండ్ చేశారు.




