వలిగొండలో కెసిఆర్ దిష్టిబొమ్మలు తగలబెట్టిన కాంగ్రెస్ నాయకులు.
వలిగొండ జనం సాక్షి న్యూస్ 12. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించి సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి కంకాల కిష్టయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఉచిత విద్యుత్తు పతకము రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పి రైతులను ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం అని మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు సహా దగా కోరుమాటలు చెప్పి కాలము గడుపుతున్నారు రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తానన్నాడని తప్పుడు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోబోరని వారు హెచ్చరించారు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న రాష్ట్ర బిఆర్ఎస్ ప్రభుత్వము అని ఎద్దేవా చేశారు రైతులకు మూడు ఎకరాల భూమి రుణమాఫీ డబల్ బెడ్ రూములు కట్టి ఇస్తామని చెప్పినది కేసీఆర్ కాదా అని వారన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం నాయకులు బోళ్ళ శ్రీనివాస్ బత్తిని సహదేవ్ ఎంపీటీసీల పురం అధ్యక్షులు రామ్ రెడ్డి సంజీవరెడ్డి కాసుల వెంకన్న మండల ఆప్షన్ నెంబర్ రసూల్ పల్లెర్ల సుధాకర్ పల్లెర్ల రాజు. మైసూర్ల ప్రవీణ్ బత్తిని వరుణ్ నర్సిరెడ్డి ఆవుల స్వామి వివిధ గ్రామాలకు శాఖల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.