Thursday, 5 November 2026

వశిష్ట డ్రీo ప్రాజెక్ట్ అద్భుతంవశిష్ట డ్రీo ప్రాజెక్ట్ అద్భుతం ఎమ్మెల్యే భాస్కరరావు

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి వశిష్ట డ్రీమ్ ప్రాజెక్ట్ అద్భుతంగా ఉందని మిర్యాలగూడ శాసనసభ్యులు నలమోతు భాస్కరరావు అన్నారు. మిర్యాలగూడ  మండలంలో  కిష్టాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన డ్రీమ్ సిటీ వెంచర్ బ్రౌచర్  ను మిర్యాలగూడ శాసనసభ్యులు  నల్లమోతు భాస్కర్ రావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ఆవిష్కరించారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి   సోకిన అనంతరం ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాన్ని  ఆహ్లాదకరంగా మార్చుకోవాలని ఆశపడుతున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న  వశిష్ట నివాస గృహాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, గుడిపాటి సైదులు బాబు, జక్క నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.