Thursday, 5 November 2026

సతీసమేతంగా శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు:అడిషనల్ కలెక్టర్.

 

 

 

 

 

 

ధర్మపురి (జనం సాక్షి) ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంనకు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మకరందు  సతీసమేతంగా శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం సాదరంగా స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య స్వామివారి శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటి సభ్యులు వేముల నరేష్,గందె పద్మ శ్రీనివాస్,మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.