ఝరసంగం ఏప్రిల్ 17;- ( జనం సాక్షి) మండలం పరిధిలో వీరభద్ర ఫర్టిలైజర్ దగ్గర హన్మన్న పటేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, రిబెన్ కట్ చేసి ప్రారంభించారు,ఈ సందర్భంగా వివిధ గ్రామాల వాహనదారులకు, కాలినడకదారులకు, పట్టణ ప్రజలకు ఎండాకాలం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ వ్యవస్థాపకులు ఈశ్వర్ పాటిల్, విజయ్ కుమార్ పాటిల్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు జగదీశ్వర్, మాజీ మండలం అధ్యక్షులు సంగన్న, శ్రీనివాస్ రెడ్డి, ప్రభు పటేల్,నర్సింహా పాటిల్, ఉపసర్పంచ్ మాణిక్ యాదవ్, జాగృతి కన్వినర్ పాండు, శ్రీనివాస్, బసప్ప, సంగమేష్, మరియు కంబాలపల్లి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




