వాకర్స్‌తో మంత్రి జగదీశ్‌ రెడ్డి భేటీ

సూర్యాపేట,నవంబర్‌14(జ‌నంసాక్షి):తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రాబోతోందని మంత్రి జగదీష్‌ రెడ్డి చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గ ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ఆయన.. ఉదయం స్థానిక ఎస్‌వి డిగ్రీ కాలేజీలో వాకర్స్‌ ను కలిసి ముచ్చటించారు. కొద్దిసేపు షటిల్‌ ఆడారు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌ వల్ల.. తనకు ఎంతో ఇష్టమైన ఆటలను ఆడలేకపోతున్నానని చెప్పారు. గ్రౌండ్‌ లో సదుపాయాలు, ఇబ్బందులను వాకర్స్‌ ను అడిగి తెలుసుకున్నారు.

 

 

తాజావార్తలు