Tuesday, 3 November 2026

వాక్‌చేయండి ఫిట్‌నెస్‌ పెంచుకోండి : సానియా

హైద్రాబాద్‌, నవంబర్‌4(జనంసాక్షి): నడక మనిషికి మేలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ వాక్‌ చేసి ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని హైద్రాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అన్నారు. ఆదివారం ఉదయం కేబీఆర్‌ పార్క్‌లో నిర్వహించిన వాక్‌ ఫర్‌ ఫిట్‌నెస్‌లో ఆమె పాల్గొని ప్రారంభించారు. నడక మనిషికి ఆరోగ్యాన్నివ్వడమే కావ, అందాన్ని పెంచుతుందని తెలిపారు. రోజుకు కనీసం పది నిమిషాల నడక ద్వారా హృదయానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయని, ఎల్లప్పుడూ వాకింగ్‌ ద్వారా ఫిట్‌నెస్‌ కాపాడుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా నడకలో పాల్గొన్న వారిని ప్రోత్సాహించేందుకు లక్కీ కూపన్లు ఇచ్చి సానియా చేతుల మీదుగా విజేతలను ఎంపిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *