శ్రీకాకుళం: నీలం తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను భారీ వర్షాలు మొంచెత్తాయి. అత్యధికంగా గారలో 21.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. సంతబొమ్మాళిలో 15.2 పొలాకిలో 10.2 పూసపాటిరేగలో 9.5 టెక్కలిలో 8.6, ఆముదాలవలసలో 7.9 కోరుఉకొండలో 14.9, ఆనందపురంలో 6.5 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలియజేశారు.




