Wednesday, 4 November 2026

వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం

అధికారుల తీరుపై మండిపడ్డ సభ్యులు

పరిధి దాటవద్దని హెచ్చరిక
సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌.

రామారెడ్డి జనవరి 9 ( జనంసాక్షి ) :

మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ఎంపీపీ దశరథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం లో పలువురు సభ్యులు పలు సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. అర్హులైన పలువురికి ఆసరా పింఛన్లు రావడం లేదన్నారు . ఎందుకు మిస్సయ్యాయో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ల ఖాళీలు, ఆయాల పోస్టుల వివరాలు ప్రభుత్వానికి పంపాలన్నారు, వృద్ధాప్యం, రోగులు, లేవలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు బియ్యం పంపిణీకి ప్రత్యామ్నాయం చూడాలన్నారు. మండల సభ్యులు అధికారులను కోరారు. అలాగే చిన్న గ్రామ పంచాయతీలకు బిల్లులు త్వరగా చెల్లించి ఇబ్బందులు తీర్చాలని ఓ సర్పంచ్‌ కోరారు.
జనరల్‌ బాడీ సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ నిధుల వినియోగంపై సంబదీత అధికారిని వివరాలు అడుగగా, ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై వైస్‌ ఎంపీపీ రవీందర్ రావు తో పాటు పలు గ్రామాల సర్పంచులు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవో అధికారిననే విషయం మరిచి పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇది ఇలా ఉండగా మన ఊరు-మన బడి పనుల బిల్లులను ప్రభుత్వం నూరు శాతం త్వరితగతిన చెల్లిస్తున్నట్లు పీఆర్‌ ఇన్‌చార్జి స్పష్టంగా చెప్పారు. పలు గ్రామాల అభివృద్ధి పనుల నోట్‌ ఫైళ్లపై సంతకాలు చేయకుండా సతాయిస్తున్నా రని సర్పంచ్‌ లు కొందరు వాపోయారు. దీంతో ఏడాదికిపైగా చేసిన పనుల బిల్లులు నిలిచిపోయా యయని వారు మండిపడ్డారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే వడ్డీ పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇబ్బంది పెడుతున్న ఉప సర్పంచులను గుర్తించి, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సస్పెండ్‌ చేయాలని అధికారులను డిమాండ్‌ చేశారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో విజయ్ కుమార్ సమాధానం చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఎంపిటిసిలు జెడ్పిటిసి మోహన్ రెడ్డి మండల పరిషత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు