Thursday, 5 November 2026

వామపక్షాల ఆందోళన

అనంతపురం,నవంబర్‌12(జ‌నంసాక్షి): ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ..సోమవారం ఉదయం వామపక్షాల ఆధ్వర్యంలో రాప్తాడు మండల కేంద్రంలోని పంగల్‌ రోడ్‌లో రహదారుల దిగ్బంధం చేపట్టారు. రూ.25 వేలు ఎకరాల పంట నష్టపరిహారం చెల్లించాలని, 4,5 విడతల

రుణమాఫీ ఒకేసారి జమ చేయాలని, పిఎబిఆర్‌ కింద 49 చెరువులను పూర్తిగా నింపి ఆయుకట్టుకు నీరివ్వాలని తదితర డిమాండ్లతో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి సావిత్రి, జిల్లా కమిటీ నాయకులు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, రామాంజి, నమ్మ చిరుతల మల్లికార్జున, రామకఅష్ణ, పద్మావతి, మండల కార్యదర్శులు పోతలయ్య, నాగరాజు, నాయకులు చంద్రశేఖర్‌ రెడ్డి, లింగన్న, నారాయణస్వామి, భాస్కర్‌, నారాయణ, పాలచర్ల నరేంద్ర, రమేష్‌, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.