హుజూరాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ డీవీ నాగేశ్వర రావు.
వీణవంక జనవరి 24 (జనం సాక్షి) వీణవంక మండలంలోని గన్ముకుల మోడల్ స్కూల్ లో ఈరోజు హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ డి వి నాగేశ్వర రావు జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని వీణవంక మండలంలో నిర్వహించడం జరిగింది. జడ్జి పొక్సో చట్టంపై నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో ముఖ్య అతిధి గా పాల్గొన్న హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ డివి నాగేశ్వరరావు మాట్లాడుతూ 18 సంవత్సరముల లోపు వయసు కలిగిన బాలబాలికలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు పోక్సో చట్టం తీసుకువచ్చాయని, బాలబాలికల పై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడం, జరుగుతుందని బాలబాలికలకు వేధింపులు, అత్యాచారాల నుండి రక్షణ కల్పించడం చట్టం ప్రధాన ఉద్దేశ్యం అని వారు పేర్కొన్నారు. విద్యార్థులందరూ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులకు ఏ రకమైన లైంగిక వేధింపులు ఎదురయినా, వెంటనే తల్లిదండ్రులకు మరియు పాఠశాలలో ఉపాధ్యాయులకు తెలియజేసి చట్టం దృష్టికి తీసుకొని వస్తే వారికి న్యాయం జరుగుతుందని అన్నారు.విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చడం కోసం కృషి చేయాలని, నిరంతరం తమను తాము అభివృద్ధి చేసుకునేందుకుసమయం కేటాయించుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ప్రయత్నించాలని ఉద్బోధించారు.ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న హుజురాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అలేఖ్య. మాట్లాడుతూ ప్రభుత్వాలు బాలికలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయనీ, అట్టి అవకాశాలు వినియోగించుకుని విద్యార్థినిలు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పోక్సో చట్టంపై అవగాహన కలిగిఉండాలని, విద్యార్థినీ విద్యార్థులకు ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి వారి రక్షణకు తగు చర్యలు తీసుకునే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు శ్రీనివాస రెడ్డి, అడ్వకేట్స్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ వేణు గోపాల రెడ్డి తో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు




