చెనై: తమిళనాడులో వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారింది. ఈ వాయుగుండ చెన్నైకు ఆగ్నేయంగా 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తీవ్ర వాయుగుండం మరింతగా బలపడి తుపానుగా మారే ప్రమాదం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై -కడలూరు మధ్య ఈ నెల 31న వాయుగుండం తీరందాటే అవకాశం ఉందని ఆశాఖ తెలిపింది.




