బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక పొగురు వద్ద మరపడవలో వెళుతున్న వాయుసేవ సిబ్బందిలో ఒకరు సముద్రంలో గల్లంతయ్యారు. వాయు సేవలో పనిచేస్తున్న నలుగురు సిబ్బంది సముద్రంలో మర పడవలో వెళ్తుండగా అలల ఉధ్ధృతికి పడవ ఒక పక్కకు వాలింది. ఈ సంఘటనలో బోలులో ఉన్న వారిలో ఒకరు జారి సముద్రంలో పడ్డారు. గల్లంతయిన సహచరుడి ఆచూకీ కోసం మెరైన్ పోలీసులతో కలిసి సిబ్బంది గాలిస్తున్నారు. మరింత సమాచారం రావాల్సి ఉంది.




