ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనిగర్ జెమినాలోని ఓ పాఠశాలకు సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ బేఫ్ క్యాంపుపై మిలిటెంట్లు దాడి చేశారు. ఈ సందర్భంగా మిలిటెంట్లకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు జవాన్లను స్థానిక మిలటరీ ఆసుపత్రికి తరిలించారు. క్యాంపుకు సమీపంలోని పాఠశాల విద్యార్థులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. 2010 తర్వాత శ్రీనగర్‌లో ముష్కరులు దాడులకు దిగడం ఇదే తొలిసారి.




