వారణాసిలో దిగనున్న తొలి సోలార్ విమానం

వారణాసి: ప్రపంచంలోనే తొలి సోలార్ విమానం ‘సోలార్ ఇంపల్స్-2’ బుధవారం సాయంత్రం వారణాసిలో దిగనుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటిస్తున్న ఈ విమానం పరిశుభ్రత, క్లీన్ ఎనర్జీ అనే అంశాలపై సందేశానికి చిహ్నంగా  గంగా నదిపై ఎగిరి వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. ఈ విమానం రెండు గంటల ఆలస్యంగా అహ్మదాబాద్ నుంచి బయలు దేరింది.