హైదరాబాద్, మార్చి 18 : ఒక మద్యం వ్యాపారిని లాబీల్లోకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీత తీసుకొచ్చిన ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ బుధవారం అసెంబ్లీలో లేవనెత్తారు. ఆ వ్యాపారిని మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీలోకి తీసుకురావడం అనేది ఎంతవరకు సబబు అని అరుణ ప్రశ్నించారు. ఒక పత్రికలో వచ్చిన వార్త కాపీని సభాపతికి చూపించారు. అయితే అరుణ వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ సభ్యుడు పద్మారావు ఖండించారు. పత్రికల్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని మాట్లాడ్డాం సరికాదని ఆయన అన్నారు. మద్యం వ్యాపారి ఎలా వచ్చాడో ఎవరికీ తెలియదని పద్మారావు వివరణ ఇచ్చారు.
ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ పేపరులో వచ్చిన వార్త ఆధారంగా చేసుకుని తనపై అరుణ ఆరోపణ చేశారని దాన్ని నిరూపించాలని ఆమె సవాల్ చేశారు. ఆరోజు వచ్చింది… నేను సంతకం చేసి పాస్ ఇచ్చింది. నా పర్సనల్ పీఆర్‌ఓ అని సునీత చెప్పారు. కావాలంటే ఆరోజు సీసీ పూటేజ్ కెమెరాలను పరీక్షించవచ్చునని ఆమె అన్నారు. అలాగే డీకె అరుణ కుటుంబంపై వర్త వచ్చిందని సునీత అన్నారు. వార్త సారాంశం… ‘‘డీకె కుటుంబానికి అక్రమ మైనింగ్’’ దీనికి ఆమె ఏం సమాధానం చెబుతారని సునీత ప్రశ్నించారు. .




