Friday, 6 November 2026

ఎమ్మార్పీఎస్‌ చలో అసెంబ్లీ భగ్నం

హైదరాబాద్‌, మార్చి 18: ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడిక్కడ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్కు వద్ద 40 మంది ఆందోళనకారులను, పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద మరో 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా నగరంలో అనుమానితులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మార్పీఎస్‌ నేత లింగస్వామిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి.. లంగర్‌హౌస్‌ పీఎస్‌కు తరలించారు. మరోవైపు నిరుద్యోగ జేఏసీ నేతలు కల్యాణ్‌ మానవతరాయ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *