వాలీబాల్‌ టోర్నీకి భారీగా ఏర్పాట్లు

ఏలూరు,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): నల్లజర్ల వేదికగా జాతీయస్థాయిలో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు అండర్‌-17 జాతీయస్థాయి వాలీబాల్‌ టోర్నీ నిర్వహణకు భారీగాఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్టాల్రనుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా రాష్టాల్ర క్రీడాడాకారులకు వారి వంటకాలను పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని 28 రాష్టాల్ర నుంచి హాజరయ్యే క్రీడాకారులకు వసతి దగ్గర నుంచి భోజన ఏర్పాట్లు, ఇతర సౌకర్యాల కల్పనలో లోటులేకుండా చూస్తున్నారు. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ఇందుకు అందరూ సహకరించాలని జడ్పీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. వాలీబాల్‌ టోర్నమెంటు ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సవిూక్ష చేసి పలు సూచనలు చేశారు. ఇది జిల్లా పరువు ప్రతిష్టలకు కూడా సంబంధించిన విషయమన్నారు. పర్యవేక్షణ కమిటీ అన్ని విషయాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

తాజావార్తలు