Wednesday, 4 November 2026

వాల్మీకి తాలూకా భవననిర్మాణంకోసం కృషి చేస్తా

వాల్మీకి తాలూకా భవననిర్మాణంకోసం కృషి చేస్తా ఎమ్మెల్యే అబ్రహం అలంపూర్ జనంసాక్షి (జనవరి 7)అలంపూర్ మున్సిపాల్టీ నందు వాల్మీకి మహర్షి గుడికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాని వాల్మీకులు శనివారం ఏర్పాటు చేశారు. భూమి పూజ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వియం అబ్రహం హాజరై 4 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసారు.
అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ,
వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సానుకూలంగా ఉన్నారు అన్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో వాల్మీకిలకు తాలూక భవనం కోరకు స్థలం ఇచ్చి నూతన భవనం కూడా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానన్నారు .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మనోరమవెంకటేష్ ,కౌన్సిలర్లు,
వాల్మీకి నాయకులు రమేష్ నాయుడు, శేషన్న నాయుడు, మధ్ధిలేటి నాయుడు,వాల్మీ మండల అధ్యక్షుడు నారయణ నాయుడు,ఉండవెల్లి మండల అధ్యక్షుడు బైరపురం రమణ నాయుడు, అలంపూర్ మండల అధ్యక్షుడు బీచుపల్లి, లింగనవాయి ధనుంజయ్, శేర్ పల్లి నాయుడు, రమానాయుడు, అలంపూర్ నాయుడు, లింగనవాయి మహేష్ నాయుడు,చిన్న కృష్ణయ్య నాయుడు, బోంకుర్ చంద్రన్న, మహేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.