వాల్మీకుల ఎస్టీ జాబితాను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి
జాతీయ అధ్యక్షులు తిరుమలేష నాయుడు
వనపర్తి టౌన్ నవంబర్ 26 (జనం సాక్షి) : _అత్యంత వెనుకబడిన వాల్మీకుల ఎస్టీ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి..కేంద్రానికి పంపినదని వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి…ఆమోదించాలని జాతీయ అధ్యక్షులు తిరుమలేష నాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలో వాల్మీకులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శనివారం 17 రోజూకు చేరుకుంది.ఈ
నిరాహార దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు తిరుమలేష నాయుడు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వాల్మీకులు ఒకప్పుడు ఎస్టీలుగా ఉన్నారని,కానీ గత ప్రభుత్వల హయాంలో బిసి ఏ గా మార్చారని, అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల వేళ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీలు ఇచ్చి, తర్వాత విస్మరిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవల2021లో తెలంగాణ ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీజాబితాలో చేరుస్తామని తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపడం జరిగిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఆమోదం చేయకుండా వెనక్కి పంపిస్తున్నదని, మండిపడ్డారు.ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం వాల్మీకుల ఎస్టీ జాబితాను పార్లమెంట్ లో ఆమోదించాలని.లేదంటే పెద్ద ఎత్తున వాల్మీకులాంత ఉద్యమిస్తామన్నారు.ఈ కార్యక్రములో రాష్ట్ర అధ్యక్షులు రేపల్లె కృష్ణ,హైదరాబాద్ అధ్యక్షులు బొగ్గువెంకటేష్,ఎర్ర నరసింహులు,మూర్తి,రమేష్ వేణుగోపాల్, టికేకురుమన్న, నిలస్వామి,హరి శంకర్ నాయుడు, ఉమ్మలరాములు,రామస్వామి,నాగారం రవి, విజయ్, తిరుమల్, నరేష్ నాయుడు, శారదమ్మ, సర్పంచ్ తాటిపాముల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు_
వాల్మీకుల ఎస్టీ జాబితాను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి




