స్వీప్ కార్యక్రమాలను వేగవంతం చేయాలి — అదనపు కలెక్టర్ సంధ్యా రాణి
హన్మకొండ బ్యూరో చీఫ్ 26 జనంసాక్షి
శనివారం నాడు అదనపు కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో స్విప్ కార్యక్రమం,స్పెషల్ సమ్మరీ రివిజన్ పై సమీక్షసమావేశంనిర్వహించారు
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూజిల్లాలో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని కళాశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించి వారిచే ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా నమోదు చేయాలనీ తెలిపారు. జిల్లాలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు యువతను భాగస్వాములను చేసి 100 శాతం ఓటరు నమోదుతో పాటు తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు జిల్లాలో ఓటరు జాబితాను తప్పులు లేకుండా సిద్ధం చేయాలని అన్నారు.స్పెషల్ సమ్మర్ రివిజన్ వేగంగా జరగాలని, స్పెషల్ సమ్మర్ రివిజన్ ప్రాధాన్యత మరింత పెరగాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మర్ రివిజన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను సవరణ చేస్తుందన్నారు. అర్హులు, జనవరి 1, 2023 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటరు నమోదు చేసుకోవాలని, 17 యేళ్లు నిండిన వారు కూడా అడ్వాన్స్ (ముందస్తు)గా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం 5 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీఎల్‌వోలు ఆయా అధికారులు సమన్వయంతో పని చేసి తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఓనరబుల్ గ్రూప్స్‌ను గుర్తించి (దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్) వారందరూ ఓటరు జావితాలో నమోదు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. మున్సిపాలిటీల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్ నమోదు స్వీప్ కార్యక్రమాలు జరపాలని, గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న పనిని మానిటరింగ్ చేయాలని ఆయా సంబంధిత అధికారులకు చెప్పారు. ఓటరు నమోదు, ఓటరు జాబితాను సరిచూసుకునేందుకు ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ఓటు హక్కు నమోదుపై విస్త్రత ప్రచారం చేయాలని, జిల్లాలో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో గల అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు క్లెయిమ్స్‌కు సంబంధించి దరఖాస్తులను డిసెంబరు 8వ తేదీ వరకు స్వీకరించాలని చెప్పారు.కళాకారులూ చే ఈ స్విప్ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. పట్టణం లో ఓటు నమోదు తక్కువ ఉందని దీని పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని అన్నారు. Ncc విద్యార్థులను ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం చేయాలనీ అన్నారు.ఓటర్ కార్డు ను ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, ఆధార్ అనుసంధానం లో ఇటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలను కోరారు.
ఈ సమావేశం లో డి ఆర్ ఒ వాసు చంద్ర, pd drda శ్రీనివాస్ కుమార్,మెప్మా pd బధ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు




