Monday, 2 November 2026

వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 30, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు జ్యోతి ప్రజ్వలన, సంకల్పము, గణపతి పూజ, పుణ్యవచనం రక్షాబంధన అష్టోత్తర కల్సాభిషేకం నిర్వహించారు. 10 గంటలకు శ్రీ వాసవి సామూహిక వ్రతకల్పం చేపట్టారు. మధ్యాహ్నం 12:30 కు అగ్ని ప్రతిష్ట, లక్ష్మీ గణపతి, నవగ్రహ శ్రీ వాసవి మూలమంత్ర హవనము కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు సామూహిక బోధన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు మేళతాలాలతో పుర వీధులలో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ వాసవి మహిళా ఆధ్వర్యంలో కోలాటాలతో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. రాత్రి 10 గంటలకు అమ్మవారికి చక్కర స్నానం, హారతి, పవళింపు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి మహిళా మండలి, శ్రీ వాసవి దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ నరేందుల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి తణుకు నవీన్, కోశాధికారులు రాచర్ల సుధాకర్, తణుకు కుమారస్వామి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాత భాస్కర్, యువజన సంఘం అధ్యక్షుడు పుల్లూరు వెంకటేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు బాల విజయలక్ష్మి, అధిక సంఖ్యలో బెల్లంపల్లి ఆర్యవైశ్య భక్తజనులు పాల్గొన్నారు