వికారాబాద్ రూరల్ ఫిబ్రవరి 24 జనం సాక్షి
వికలాంగులకు వర్తించే పథకాలపై అధికారులు నిర్లక్ష్యం గురి చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారని వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకుమార్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ వికలాంగులకు ఆసరా పింఛన్ల ద్వారా 3016 రూపాయలు కాగా పోస్ట్ ఆఫీస్ లో కేవలం 3000 రూపాయలు మాత్రమే ఇచ్చి ప్రతి నెల 16 రూపాయలు దండుకుంటున్నారన్నారు వికలాంగుల కోసం సదరం క్యాంపులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని వారు ఆరోపించారు వికలాంగుల బంధు ఏర్పాటు చేసి ప్రతి వికలాంగునికి 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు సూచించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు శంకర్రావు వివిధ గ్రామాల వికలాంగులు పాల్గొన్నారు
వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్




