వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 29 జనం సాక్షివికారాబాద్ అసెంబ్లీ ఎల్ డి ఎం కోఆర్డినేటర్ గా చామల రఘుపతి రెడ్డి నీ నియమించినట్లు వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలిపారు లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ ఎల్ డి ఎం ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ స్థానాలలో పనిచేసేందుకు ఎల్ డి ఎం కోఆర్డినేటర్ లను నూతనంగా నియమించింది అందులో భాగంగా వికారాబాద్ అసెంబ్లీ స్థానానికి చామల రఘుపతి రెడ్డిని నియమించినట్లు తెలిసింది ఈ సందర్భంగా రఘుపతి రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎల్ డి ఎం కోఆర్డినేటర్ గా నియమించినందుకు ఏఐసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షులు రాజేష్ లిలోతియా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనకు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రుణపడి ఉంటానని కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు




