Thursday, 5 November 2026

వికారాబాద్ అసెంబ్లీ స్థానానికి బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తుప్ప ఆనంద్ కు టిక్కెట్టు కేటాయించాలి పేద ప్రజలకు చేదోడు వాజోడుగా నిలుస్తున్న ది లైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ చిన్నపిల్లల నిపుణులు డాక్టర్ తప్ప ఆనంద్

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 13 జనం సాక్షివికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నీకి బిఆర్ యస్ అసెంబ్లీ టికెట్ డాక్టర్ తప్ప ఆనంద్ కు కేటాయించాలని మోమిన్ పేట మండల టిఆర్ఎస్ ఉద్యమకారులు సీనియర్ నాయకులు ఎల్ఐసి బి మాణిక్ రెడ్డి దళిత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సాయం ముళ్ళ నరసింహులు లు పేర్కొన్నారు శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తుప్ప ఆనంద్ తండ్రి మోమిన్ పేట మాజీ సర్పంచ్ స్వర్గీయ తుప్ప రామయ్య 80 సంవత్సరాల వయసులో మోమిన్ పేట నుండి వికారాబాద్ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి ఆయన కుమారుడే తుప్ప ఆనంద్ నిరుపేదలకు రాయితీతో కూడిన వైద్యం అందిస్తూ అనేక సేవలు చేస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు ప్రతి గ్రామాల్లో రక్తదాన శిబిరాలు డప్పు దరువు కార్యక్రమాలు వివాహ కార్యక్రమాలకు ఆర్థిక సాయం వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తూ ప్రజల మనోళ్ళలో పొందుతున్నారు డాక్టర్ తుప్ప ఆనంద్ కు వికారాబాద్ బి ఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ కేటాయిస్తే మేజర్ గ్రామపంచాయతీ మోమిన్ పేటకు న్యాయం జరిగినట్లు అవుతుందని వారు పేర్కొన్నారు మోమిన్ పేట మండల కేంద్రానికి నూతన పోలీస్ స్టేషన్ సిఐ కార్యాలయాలు గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ రోడ్డు విస్తరణ పనులు ఇల్లు లేని నిరుపేదలకు చంద్ర శేఖర్ నగర్ కప్పలకుంట ఎన్టీఆర్ కాలనీ వంటి అనేక నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత తుప్ప రామయ్యకే దక్కింది ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్న డాక్టర్ తుప్ప ఆనంద్ కు వికారాబాద్ శాసనసభ టికెట్లు బి ఆర్ ఎస్ పార్టీ తరఫున కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ కు వారు సూచించారు గతంలో పార్టీ ఆదేశాల మేరకు చంద్రశేఖర్ ను సంజీవరావు డాక్టర్ మెతుకు ఆనంద్ ను గెలిపించామని ఈసారి ఎలాగైనా సరే దిలైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ తుప్ప ఆనంద్ కు అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని బి ఆర్ఎస్ పార్టీ తొలి ఉద్యమకారులు పేర్కొంటున్నారు డాక్టర్ మెతుకు ఆనంద్ కు టికెట్ అయితే బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి కేటాయించినట్లు అవుతుందని వారు హెచ్చరించారు