జనంసాక్షి, మంథని : విద్య తోనే అభివృద్ధి సాధ్యమని విగ్రహాలతో కాదని, మీకు దమ్ముంటే మంథని నియోజకవర్గనికి మెడికల్ కాలేజీ తీసుకురావాలని బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఓడ్నాల శ్రీనివాస్, ఎరుకల ప్రవీణ్ మాట్లాడుతూ..దొడ్డి కొమరయ్య మహనీయుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కెసిఆర్ దొరగడిలో బానిసగా ఉంటూ కాంగ్రెస్ నాయకులను బానిసలు అనడం సిగ్గుచేటు అన్నారు. ఇందిరమ్మ ఇళ్లులు అన్ని గ్రామాల్లో ఉన్నాయని డబుల్ బెడ్రూమ్ ఇళ్లులు ఏ ఊరిలో ఉన్నాయో చూపించాలని అన్నారు.9 సంవత్సరాలు అధికారంలో ఉన్న పుట్ట మధు దళిత బంధు, బీసీ బందు, డబల్ బెడ్ రూమ్ ఇల్లులు, మూడెకరాల భూమి ఎంత మందికి ఇప్పించారని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలు శివ, జంజర్ల శేఖర్,మంథని సత్యం, అజింఖాన్, గోటుకారి కిషన్ జి, తోకల మల్లేష్, కుడుదుల వెంకన్న, దొర గొర్ల శ్రీనివాస్ యాదవ్, బండారి ప్రసాద్, ఎల్లంకి వంశీ, అక్కపక సదయ్య, గొల్లపల్లి శ్రీనివాస్, మంథని శ్రీనివాస్, తాళ్లపల్లి సత్యనారాయణ గౌడ్, మంథని సమ్మయ్య ఆరెల్లి కిరణ్ గౌడ్ , ఎరుకల మోహన్ సాయి,తదితరులు పాల్గొన్నారు.
విగ్రహాలతో కాదు ..విద్యతోనే అభివృద్ధి – విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు




