జిన్నారం జూన్ 5 జనం సాక్షి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం గ్రామంలో బొడ్రాయి లింగమయ్య ఊరడమ్మ గాలి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవము కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గుడం మహిపాల్రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు!! ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ కుంచాల ప్రభాకర్, మాజీ ఉమ్మడి జిన్నారం జడ్పిటిసి కోలన్ బాల్రెడ్డి, జిన్నారం మండల మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు జిన్నారం వెంకటేష్ గౌడ్, మాజీ జిన్నారం ఎంపీటీసీ, శ్రీనివాస్ రెడ్డి ఉపసర్పంచ్ సంజీవ పంచాయతీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ జంగంపేట్ సర్పంచ్ ఉప సర్పంచ్ తదిరిల్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి




