Wednesday, 4 November 2026

విచారణకు ఎందుకు సహకరించరో.. జగన్‌ చెప్పాలి

– టీడీపీ నేత వర్ల రామయ్య
అమరావతి, నవంబర్‌13(జ‌నంసాక్షి) : కోడికత్తిదాడి కేసులో విచారణకు ఎందుకు సహకరించరో జగన్‌ చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలు తెలియజేయటానికి ఎందుకు బయపడుతున్నారని ప్రశ్నించారు. పాదయాత్రలో జగన్‌ ఎందుకు హత్య యత్నం గురుంచి చెప్పలేదని అడిగారు. దాడి ముందస్తు ఆలోచనతోనే జరిగిందా అని అన్నారు. వాస్తవాలు ఎవరికి చెప్తావని అన్నారు. విజయమ్మ దాడి చేసిన వ్యక్తి మా అభిమని అని చెప్తున్నారన్నారు.  ఇంటికి వెళ్లాల్సిన విూరు మనసు మార్చుకొని ఆసుపత్రికి వెళ్లావు.. పీఎం పేషీ నుంచా.. జీవిఎల్‌.. చేశాడా..కన్నా చేశాడా? ఇంకెవరు చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని ముఖ్య వ్యక్తికి నిందితుడు నుంచి రెండు వందల ఫోన్‌ కాల్స్‌ ఎలా వెళ్లాయన్నారు. జగన్‌ కి అత్యంత ఆప్తుడు అని వైరల్‌ అవుతుందని, పోలీసులు విచారణ చేసి సమాధానం చెప్పాలన్నారు. హైకోర్టు కూడా జగన్‌ ను ఫిర్యాదు చేయని విషయంపై ప్రశ్నించలేదన్నారు. విచారణ జరిపితే కోడి కత్తి డ్రామా తన మెడకే చుట్టుకుంటుందని జగన్‌ బయపడుతున్నారన్నారు. మోడీ చెవిలో చెప్తావా అని అడిగారు. జగన్‌కు బీజేపీ అంటే భయం పట్టుకుందని, బీజేపీ నిలదీయాంటే మోడీ ఏం చేస్తాడోననే భయం వైసీపీ శ్రేణులను వెంటాడుతుందన్నారు. పవన్‌ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే పవన్‌ సభలు పెడుతున్నారని అన్నారు.