Thursday, 5 November 2026

విచారణ.. అంతా తూచ్..!

 

నామ్ కే వాస్తేగా వచ్చి..హడావిడి చేసి వెళ్లిన విజిలెన్స్ అధికారులు

పెద్ద స్థాయిలో ఉన్న అక్రమార్కులను..వదలిపెట్టడమంటే..కిందిస్థాయిలో జరిగే అవినీతి..అక్రమాలను ప్రోత్సహించినట్లేనా..?

కింది స్థాయి నుండి హెడ్ ఆఫీస్ వరకు అందరి బాగోతాలు బయట పడతాయనే చేసిన తప్పులను కప్పిపుచ్చి కాపాడుతున్నారా..?

మీరు ఏం చేసినా ఫర్వాలేదు.. సెక్రటరీ సార్ దాకా పోకుండా మేము చూసుకుంటాం.. పోయినా మేం మేనేజ్ చేస్తామనే ధీమా ఇస్తున్నారా..?

వచ్చిన వాళ్లలో ఇద్దరు నా జూనియర్లే..ఎవ్వరు ఏంచెప్పినా నాకు తెలుస్తుంది.. తర్వాత తడాఖా చూపిస్తానన్న కరీంనగర్ విజిలెన్స్ అధికారి

ఓవిజిలెన్స్ అధికారి కూతురిని సిరిసిల్ల బాలికల గురుకులంలో ఔట్ సోర్సింగ్ ప్రిన్సిపాల్ గా నియమించుకున్న వైనం

మంథని బాలికల కళాశాలలో ప్రిన్సిపాల్ నామ్ కే వాస్తే.. విజిలెన్స్ అధికారుల ఇష్టారాజ్యం

అక్రమార్కులకు హెడ్ ఆఫీస్ అదృశ్య శక్తుల వెన్నుదన్ను

నేను చెప్పిన క్యాండేట్ కు జేఎల్ ఉర్దూ ఇచ్చేయండి.. వివరాలు మెయిల్ చేస్తా..నామినల్ గా ఇంటర్వ్యూ నిర్వహించండి.

ఆర్ఎల్సీకి హుకుం జారీ చేసిన..ఓ ఉర్దూ జర్నలిస్టు..హెడ్ ఆఫీస్ అకాడమిక్ అధికారి

ఎల్ఎస్జీ మీటింగ్ నిర్వహించకుండా..ప్రార్థనకు రాకుండా..నాన్ టీచింగ్ సిబ్బందిని వేధిస్తూ ఊడిగం చేయించుకునే ప్రిన్సిపాళ్లపై..ఔట్ సోర్సింగ్ నియామాకాల్లో లక్షలు వసూలు చేసిన విజిలెన్స్ పై చర్యలు ఏవీ..?

ఎల్ఎస్జీ మీటింగ్ పెట్టకుండా.. ప్రార్థన కు రాని ప్రిన్సిపాళ్లపై.. జిల్లా అకాడమీక్ హెడ్ ఏండ్ల తరబడి ఎందుకు రిపోర్టు ఇవ్వలేదు..?

టెమ్రీస్ లో కలుపు మొక్కలను ఏరివేసి ప్రక్షాళన చేస్తారా..లేక చుద్దాంలే అని వదిలేస్తారా.. అంతు చిక్కని ఉన్నతాధికారుల వ్యవహారంపై సర్వత్రా విమర్శలు

కరీంనగర్, ఆగస్టు 23:నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మారింది మైనార్టీ గురుకులాల ఉన్నతాధికారుల తీరు. గత కొద్ది రోజుల క్రితం మైనార్టీ గురుకులాల విజిలెన్స్ అధికారుల అవినీతి అక్రమాలపై, ఆర్ఎల్సి సురేష్ వ్యవహార శైలిపై కోకోల్లలుగా వార్తలు వస్తే నామ్కే వాస్తేగా విచారణ జరిపించి.. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి విజిలెన్స్ అధికారులను విచారణకు పంపి హడావిడి చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే రిక్రూట్ అయిన రెండు వార్డెన్ పోస్టులు, ఒక ఎలక్ట్రిషన్ పోస్టుకు సంబంధించిన ఔట్ సోర్సింగ్ నియామకాల్లో, విజిలెన్స్ అధికారులు, ఓఉర్దూ జర్నలిస్టుతో కలిసి లక్షల్లో డబ్బులు వసూలు చేసినప్పటికీ, సదరు వ్యవహారం విచారణ అధికారులు నోట్ చేసుకొని వెళ్ళినప్పటికి, సదరు అవినీతిపరులను, అక్రమార్కులసై వదిలిపెట్టడం చూస్తుంటే.. కింది స్థాయిలో ఉన్న వార్డెన్లు, ప్రిన్సిపాల్లు కలిసి చేసే అక్రమ భాగోతాలకు.. మైనార్టీ గురుకులాల ఉన్నతాధికారులు వెన్నుదన్నుగా ఉండి, అవినీతి అక్రమాలను ప్రోత్సహించడమేనని పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు మీరు ఏం చేసినా పర్వాలేదు.. సెక్రటరీ సార్ వరకు విషయం వెళ్లకుండా, మేం చూసుకుంటాము. ఒకవేళ వెళ్లిన మేమే మేనేజ్ చేస్తాం.. గో ఎ హెడ్ అంటూ అక్రమార్కులైన విజిలెన్స్ అధికారులకు క్లీన్ చీట్ ఇవ్వడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురుకులాలో నాన్ టీచింగ్ సిబ్బంది చిన్నపాటి తప్పులు చేస్తే వారిని, ఉద్యోగాల్లో నుంచి తొలగించే హెడ్ ఆఫీస్ ఉన్నత అధికారులు ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వారిని ఎందుకు కాపాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు వచ్చినటువంటి నిజామాబాద్, మంచిర్యాలకు చెందిన ఇద్దరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లైన, విజిలెన్స్ అధికారులు ఇద్దరు నా జూనియర్లేనని, వారికి ఎవరు, ఏం చెప్పారో నాకు తప్పకుండా వాళ్లు చెబుతారని, తర్వాత నా తడాఖా చూపిస్తానని కరీంనగర్ విజిలెన్స్ అధికారులు, పలువురిని ఉద్దేశించి బెదిరించడం చూస్తుంటే హెడ్ ఆఫీస్ లో వీరికి అండదండగా ఉన్న అదృశ్య శక్తులు ఏ స్థాయిలో అభయమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ ఆర్ఎల్సి గా బాలుర-2 గురుకుల ప్రిన్సిపాల్ సురేష్ బాధ్యతలు చేపట్టాక, బాలుర-2 గురుకుల ప్రిన్సిపల్ గా రెగ్యులర్ ఉర్దూ జేఎల్ ను నియమించారు. ఈనేపథ్యంలో సదరు ఉర్దూ జేఎల్ పోస్టును భర్తీ చేయడం కోసం హెడ్ ఆఫీస్ లో ఉన్న అకాడమిక్ విభాగం చూస్తున్న అధికారి, ఓఉర్దూ మీడియా జర్నలిస్టు కలిసి, తాము ఓవ్యక్తి పేరును మెయిల్ చేస్తాం, నామినల్ గా ఇంటర్వ్యూ నిర్వహించి అతనికే జెఎల్ ఉర్దూ పోస్టును ఇచ్చేయండని అని హుకుం జారీ చేశారంటే పరిస్థితి మైనారిటీ గురుకులాల్లో ఎంత దరిద్రంగా, దారుణంగా దాపురించిందో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎంతోమంది రెగ్యులర్ టీచింగ్ ఉద్యోగులు ఉన్నప్పటికీ, ఓవిజిలెన్స్ అధికారి కూతురుకు సిరిసిల్ల బాలికల గురుకుల ప్రిన్సిపల్ గా బాధ్యతలు అప్పజెప్పి, ఆగురుకులంలో జరిగే ఎలాంటి, మంచి, చెడులను హెడ్ ఆఫీస్ కు రిపోర్ట్ ఇవ్వకుండా కాపాడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అసలు ఏ ప్రాతిపదికన సిరిసిల్ల బాలికల గురుకులంలో ప్రిన్సిపాల్ ను నియమించారో..దింతో సొసైటీకి ఎంతమేరకు నష్టం జరుగుతుందో ఇప్పటికి ప్రశ్న గానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. ఇదే గాక పెద్దపల్లి జిల్లా మంథని బాలికల కళాశాలలో నామ్ కే వాస్తేగా ఓప్రిన్సిపాల్ ను నియమించి, అట్టి గురుకులంలో జరుగుతున్న ప్రతి చిన్న పెద్ద విషయాల్లో, ప్రతి అంశంలో విజిలెన్స్ అధికారుల జోక్యం పెరిగిపోయి, అంతుచిక్కని అవినీతి అక్రమాల లోగిళ్లు ఎన్నో ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలో మంథని బాలికల గురుకులం వ్యవహారంపై పెద్దపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, పలు అంశాలపై విజిలెన్స్ అధికారులను ప్రశ్నించగా, పెద్దపల్లి డిఎండబ్ల్యూఓ పై మైనార్టీ గురుకులాల వ్యతిరేకి అని రిపోర్టులు రాసి హెడ్ ఆఫీస్ కు పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. అటు తమ కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నాడని, ప్రస్తుత ఆర్ఎల్సినీ తీసుకు రావడానికి, ఖర్మ, కర్త, క్రియ ఇలా అన్ని తామై వ్యవహరించి, ఓ జడ్పి కోఆప్షన్ సభ్యుడిని, ఒక బీఆర్ఎస్ నేతను వినియోగించుకొని, సామ, భేద, ధానా దండోపాయాలను..ప్రిన్సిపాళ్ల నుండి హెడ్ ఆఫీస్ వరకు తప్పుడు రిపోర్టు లను ప్రయోగించి, గత ఆర్ఎల్సిని పంపించడం లోనూ, పెద్దపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పై, సదరు విజిలెన్స్ అధికారులు, హెడ్ ఆఫీస్ కు తప్పుడు రిపోర్టులు రాశారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చుమరి. మైనారిటీ గురుకులాల నిబంధనలలో ప్రిన్సిపాళ్లు ఎంతమంది లైఫ్ సేవింగ్ గ్రూప్ (ఎల్ఎస్జి) మీటింగులు పెట్టారు.. రోజు ఎంతమంది ప్రేయర్.. ప్రార్థనలో ఉంటున్నారు.. నాన్ టీచింగ్ సిబ్బందిని ఎలా వేధిస్తున్నారు, వారిని భయపెట్టించి ఇండ్లలో పాచిపని, ఊడిగం ఏ విధంగా చేయించుకుంటున్నారు..స్కూళ్ల కు రావడమే లేట్ అందులోనూ కొందరు ప్రిన్సిపాళ్లు తమ ఛాంబర్ లలో సీసీ కెమెరాలు లేకుండా చేసి, వివిధ సాకులతో తొలగించి, బయోమెట్రిక్ ఖరాబ్ చేసి, పొద్దస్తమానం ఓ మహిళా ప్రిన్సిపాల్ తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ, అకాడమీక్ ను గాలికొదిలేసిన ఘటనలపై రిపోర్ట్లు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనర్ధాలపై, జిల్లా విజిలెన్స్ అధికారులు, హెడ్ ఆఫీస్ ఉన్నత అధికారులకు ఎందుకు రిపోర్ట్లు ఇవ్వలేదని ముస్లిం సమాజం గొంతెత్తి ప్రశ్నిస్తోంది. తవ్వుకుంటూ పోతే అవినీతి, అక్రమాల గనులు బయటపడుతున్నాయి తప్ప, అక్రమాలు చేసిన వారిపై వేటు ఎందుకు పడటం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా మైనారిటీ గురుకులాల్లో పరిస్థితి ఏర్పడింది. వార్డెన్ స్థాయి నుంచి హెడ్ ఆఫీస్ లో ఉన్నతాధికారుల వరకు, మధ్యలో ఉన్న విజిలెన్స్ అధికారులు, ప్రిన్సిపాళ్ల నుండి అకాడమిక్ ప్రధాన అధికారుల వరకు, ఏదో ఒక రకంగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటే కింది నుంచి పైస్థాయి దాకా, చైన్ సిస్టం మాదిరిగా పెనవేసుకున్న అవినీతి, అక్రమాల బంధాలను తెంచే విధంగా, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మైనారిటీ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించాలని, అవినీతికి అడ్డుకట్ట వేసి, గురుకులాలను కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు మైనార్టీ గురుకులాలపై మంచి అభిప్రాయాన్ని కల్పించాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోని వారిని తక్షణమే తొలగించాలని, పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. టెమ్రీస్స్ లో అవినీతి కలుపు మొక్కలను ఏరివేసి, క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన చేస్తారా, లేక బారా ఖూన్ మాఫ్ అని మనకెందుకులే అని వదిలేస్తారా, అంతుచిక్కని హెడ్ ఆఫీస్ ఉన్నతాధికారుల వ్యవహారం పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.