Monday, 2 November 2026

విచ్చలవిడి బోర్లతో నీటి సంరక్షణకు గండి

రైతుల్లో చైతన్యం లేక అడుగంటుతున్న జలాలు
సంగారెడ్డి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఇష్టం వచ్చినట్లుగా వ్యవసాయ అవసరాల కోసం బోర్లు తవ్వి భారీస్థాయిలో నీటిని తోడేస్తున్న పరిస్థితి కారణంగాభూగర్భ జలాలు వట్టిపోతున్నాయి.  అయితే అదే స్థాయిలో తిరిగి నీరు
నేలలోకి చేరకపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి సేద్యపు కుంటలు చక్కని పరిష్కారం అన్న విషయం తెలిసినా రైతుల్లో చైతన్యం రావడం లేదు. ఉపాధి క్షేత్ర సహాయకుడిని సంప్రదిస్తే… ఎవరైనా సరే తమ పొలంలో ఈ సేద్యపు కుంటను ఏర్పాటు చేసు కోవచ్చు. ఒక్క రూపాయి కూడా
ఇందుకోసం రైతులు వెచ్చించాల్సిన అవసరం లేదు. సంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల బీడు భూములున్నాయి. నీటి వసతి లేకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి చోట్ల ఊటకుంట లను నిర్మించుకునే అవకాశం ఉన్నా  చాలామంది తమ భూమిని కొంత కోల్పోవాల్సి వస్తుందనే కారణంతో వీటిని ఏర్పాటు
చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. వీటివల్ల ఆ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగే అవకాశాన్ని గుర్తించి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పొలం గట్ల వెంట, గుట్టల ప్రాంతాల్లో కందకాలు ఏర్పాటు చేసుకుంటే వాన నీటిని ఒడిసి పట్టడానికి వీలవుతుంది. ఇకపోతే వేసవి తీవ్ర
రూపం దాల్చుతున్న కొద్దీ నీటి కష్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. జలాలను ఇష్టానుసారంగా తోడేయడంతో పాటు సంరక్షణ చర్యలు నామ మాత్రంగా ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఉపాధి పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటే నీటి సంరక్షణ వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇంకుడుగుంతలు, సేద్యపుకుంటలు, కందకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా  నీటి కరవును పారదోలడానికి వీలవుతుంది. ‘జలనిధి’ పేరిట జిల్లా యంత్రాంగం ఈనెల 30వరకు ఇగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. పథకంలో భాగంగా జలసంరక్షణకు అవకాశం ఉన్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. చెరువులు,
కుంటల్లోనూ ఉపాధి హావిూ పథకం ద్వారా పూడిక తీసే వీలుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అన్నదాతలు చొరవ తీసుకుంటే తమ గ్రామంలో, పొలాల సవిూపంలో ఉన్న కుంటలు, చెరువుల్లో పూర్తిస్థాయిలో పూడిక తీయించొచ్చు. ఇలా చేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. బోరుబావుల్లో జలకళ
ఉట్టిపడుతుంది. కాలువల ద్వారా చెరువులోకి వాననీళ్లు వెళుతుంటాయి. ఈ కాలువల పక్కన అక్కడక్కడా కుంటలను ఏర్పాటు చేసుకొని నీటిని దారిమళ్లించేందుకు ఈ పథకం తోడ్పాటునందిస్తోంది.