విజయనగరం: పట్టణంలోని బాలాజీ కూడలిలో గుర్తుతెలియని వ్యక్తి వదిలివెళ్లిన సూట్‌కేసు కలకలం సృష్టించింది. సూట్‌కేసును పరిశీలించిన స్థానికులు అందులో బాంబులు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారమందించారు. బాంబు స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టి అందులో బాంబులు లేవని తేల్చడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు.




