విజయవాడ: తేదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ రోజు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. పుష్కరాలకోసం వచ్చిన అప్పటి జనగామ డీఎస్సీతో కారు పార్కింగ్ విషయంపై గొడవపడి దౌర్జన్యం చేయటంతో పోలీస్‌స్టేషన్లో దయాకరరావుపై కేసు నమోదు చేశారు. కోర్టు ఎన్నిసార్లు సమన్లు పంపినా దయాకరరావు స్పందించకపోవటంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో కోర్టు ఈరోజు దయాకరరావు కోర్టుకు హా.రయ్యారు.




