విద్యార్థినిలపై జరుగుతున్న అత్యాచారాలపై అవగాహన సదస్సు.

మిర్యాలగూడ, జనం సాక్షి:ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మిర్యాలగూడ వాగ్దేవి బాలికల కళాశాల లో విద్యార్థిని లపై జరుగుతున్న అత్యాచారాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగినది ఈ సదస్సు సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ సైదులు మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలు బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శివాని. మనీషా ఆకతాయిలా ఆగడాల వలన ఆత్మహత్య లు చేసుకుని చనిపోవడం జరిగినది వారి యొక్క మరణానికి కారకులైన వారిని తక్షణమే సమగ్ర విచారణ జరిపించి వారిని ఎన్కౌంటర్ చేయాలని. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం తగిన కట్టుదిట్టమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ. పోలీసు యంత్రాంగం కూడా కళాశాల వదిలిపెట్టిన తరువాత ఆ ప్రాంతాలలో బస్టాండ్ ప్రాంతాలలో ఆకతాయిలను పోలీసు యంత్రాంగం గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. శివాని. మనీషా ఆత్మ లు శాంతించాలంటే వారి యొక్క చావుకి కారణమైన వారిని ఎన్కౌంటర్ లేదా ఉరిశిక్ష ను విధించాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐటిడిపి నల్గొండ పార్లమెంటు అధ్యక్షులు రావిరాల నాగేందర్. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్. నలగొండ బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు చావాల వెంకటేశ్వర్లు. యమునా రాజేశ్వరి శ్రీలత శ్రీలక్ష్మి సరిత హాసిని తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు