విద్యార్థినులు అన్ని రంగాలలో ముందుండా లి – ఐద్వా నాయకురాలు కృష్ణవేణి
పెనుబల్లి, జనవరి 13(జనం సాక్షి)
విద్యార్థినులు చదువు తోపాటు అన్ని రంగాలలో ముందుండాలని ఐద్వా జిల్లా నాయకురాలు కృష్ణవేణి అన్నారు,
ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ,ఐధ్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పె నుబల్లి మండల స్థాయి ముగ్గుల పోటీలనుగురువారం విఎం బంజర్,లక్ష్య పాఠశాల ఆవరణలో జరిగి న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని కృష్ణవేణి మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం చాలా అభినంద నియమని అన్నారు, నేటి ప్రపంచంలో మహిళలు మగవారితో సమానంగా పోటీపడాలని ఇటువంటి కార్యక్రమాల్లో మహిళలందరూ కూడా పాల్గొని వారి యొక్క సత్తాచాటాలని ఆమె అన్నార,అనంతరం పోటీల్లో గెలుపొందినవిద్యార్థినులకు బహుమతులు అందజేశారు, వేమిరెడ్డి అనిత (మొదటి బహుమతి),బజ్జురి స్వరూప (రెండవ బహుమతి),రావుల నికిత (మూడో బహుమతి) అలాగే పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు చలమాల విఠల్రావు,కృష్ణార్జున, లక్ష్య పాఠశాల ప్రిన్సిపాల్ పలగాని ఈశ్వర్,అనంత వినోద్ కుమార్,రిటైర్డ్ ఉపాధ్యాయులు గోపిశెట్టి వెంకటేశ్వరరావు, సంధ్యారాణి,సిపిఎం పార్టీ పెనుబల్లి మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు,ఐద్వా పెనుబల్లి మండలం నాయకులు నాగమణి తదితరులు పాల్గొన్నారు.




