విద్యార్థి సమస్యలపై కలెక్టరేట్ వద్ద నిరాహారదీక్ష
విజయనగరం,ఆగస్ట్25(జనం సాక్షి): ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కాలేజీల విద్యార్థులు శనివారం కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం శృంగవరపుకోట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. శృంగవరపుకోట పట్టణ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం తహశీల్దార్ అరుణకుమారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, వివిధ కాలేజి విద్యార్థులు పాల్గొన్నారు.