Tuesday, 3 November 2026

విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ – మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ అర్చనరవి

హుజూర్ నగర్ జులై 4 (జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ అర్చనరవి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఉచిత నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ అర్చనరవి పాల్గొని మాట్లాడుతూ ప్ర ప్రధమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత నోటు పుస్తకాలను సరఫరా చేయడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసే నోటు పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, కౌన్సిలర్ దొంగరి మంగమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెల ఉదయశ్రీ, ఉపాధ్యాయుల శ్రీనివాస్, మాతంగి ప్రభాకర్ రావు, ఉపేందర్, దీనారాణి, అరుణ రాణి, శేషగిరి, సుజాత, అన్వేష్, వసంతరావు, అశోక్ కుమార్, మున్ని బేగం, నాగేశ్వరరావు, శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.