Tuesday, 3 November 2026

విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేసిన ఎమ్మెల్యే

మక్తల్ మే 31 (జనంసాక్షి)విద్యార్థులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మే ఒకటి నుండి గ్రామీణ ప్రాంతాలలోని క్రీడా ఆణిముత్యాలను వెలికితీయుటకు మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్లో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న 80 మంది బాలబాలికలకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలబాలికలు వేసవి సెలవులను వృధా చేసుకోకుండా, వివిధ క్రీడలలో రాణించుటకు ప్రభుత్వము వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసిందని అన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.బి. గోపాలం మాట్లాడుతూ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో మెరుగైన శిక్షణ పొందిన మహిళలు నారాయణపేట జిల్లా సీఎం కప్ పోటీలలో కోకో, వాలీబాల్ క్రీడల యందు ప్రథమ స్థానం సంపాదించి సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ ఎంపికకు కృషిచేసిన పీఈటీలు బి.రూప, అమ్రేష్, రమేష్ కుమార్ లను ఆయన అభినందించారు. అనంతరం వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వాహకులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించారు. 80 మంది బాలబాలికలకు క్రీడా దుస్తులను అందజేసిన బిఆర్ఎస్ నాయకుడుకావలి శ్రీహరిని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇస్తున్న విశ్రాంత పీఈటి బి. గోపాలమును, యోగ కోచ్ అమ్రేష్, ఖోఖో కోచ్ రమేష్ కుమార్ ను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు కావలి శ్రీహరి, అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్ జిల్లా మొగులప్ప, పీఈటీలు బి.గోపాలం, అమ్రేష్, రమేష్ కుమార్, వి. శివశంకర్, దామోదర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.